ప్రచారానికి వె ళ్లకపోతే కోవర్టుగా మిగిలిపోతావ్‌

ABN , First Publish Date - 2022-10-14T08:39:41+05:30 IST

కాంగ్రె్‌సలో ప్రధాన ప్రచారకర్త (స్టార్‌ క్యాంపెయినర్‌)గా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం సరికాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు అన్నారు.

ప్రచారానికి వె ళ్లకపోతే కోవర్టుగా మిగిలిపోతావ్‌

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరు మారాలి: వీహెచ్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): కాంగ్రె్‌సలో ప్రధాన ప్రచారకర్త (స్టార్‌ క్యాంపెయినర్‌)గా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం సరికాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు అన్నారు. ‘‘అన్నదమ్ములు ఎన్ని పార్టీల్లో అయినా ఉండొచ్చు. నిజమైన కాంగ్రెస్‌ లీడర్‌ అని చెప్పుకునే వెంకట్‌రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఆయన నిజంగా ప్రచారానికి దూరంగా ఉంటే టీఆర్‌ఎస్‌ విమర్శించినట్లు కోవర్టురెడ్డిగా మిగిలిపోతారు’’ అంటూ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తన పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికల సమయంలో వెంకట్‌రెడ్డి విదేశాలకు వెళ్లడం సరికాదన్నారు. ఇలాంటి ప్రవర్తనతో ఆయన ఇంటి పేరు మారుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెంకటరెడ్డి తీరు మార్చుకోవాలని చేతులు జోడించి అడుగుతున్నానని హన్మంత రావు అన్నారు. 

Read more