బండికి దమ్ముంటే కల్లాల వద్దకు వెళ్లాలి: జీవన్‌ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-10T07:43:09+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే రైతుల ధాన్యం కల్లాల దగ్గరికి వెళ్లాలని

బండికి దమ్ముంటే కల్లాల వద్దకు వెళ్లాలి: జీవన్‌ రెడ్డి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే రైతుల ధాన్యం కల్లాల దగ్గరికి వెళ్లాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. అప్పుడు వారికి రైతులే బుద్ధి చెబుతారన్నారు. బీజేపీ బొందను సంజయే తవ్వుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచి, ప్రజల నుంచి రూ.23 లక్షల కోట్లు లాక్కున్న మోదీ ప్రభుత్వం.. రూ.13 వేల కోట్లతో తెలంగాణ వడ్లు కొనలేదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు.


నలుగురు బీజేపీ ఎంపీలు తెలంగాణకు నలువైపులా శనిలా మారారన్నారు. మోసగాళ్లకు రూ.11 లక్షల కోట్లు మాఫీ చేసి దేశం దాటించిన ఘనత బీజేపీదే అన్నారు. ఇక పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి సామంతుడిలాగా మారారని, బీజేపీకి ఏజెంట్‌లా పనిచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేకుల గూటి పక్షి అయిన రేవంత్‌.. సెక్షన్‌ 8 గురించి మాట్లాడి మరోమారు తెలంగాణ వ్యతిరేకి అని నిరూపించుకున్నారన్నారు. 


Read more