World Wide Book of Records: గణితంలో ఐదేళ్ల బాలుడి వరల్డ్‌ రికార్డ్‌

ABN , First Publish Date - 2022-11-26T10:41:28+05:30 IST

టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలుడు ఉజ్జెయిల్‌ విక్టర్‌ గణితంలో వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సాధించి రికార్డు సృష్టించాడు. కేవలం ఐదు

World Wide Book of Records: గణితంలో ఐదేళ్ల బాలుడి వరల్డ్‌ రికార్డ్‌

హైదరాబాద్‌ సిటీ: టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలుడు ఉజ్జెయిల్‌ విక్టర్‌ గణితంలో వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సాధించి రికార్డు సృష్టించాడు. కేవలం ఐదు నిమిషాల్లో 50 కూడికలు (సింగిల్‌/డబుల్‌ డిజిట్‌) చేసి ఈ రికార్డు సృష్టించాడు. అబాకస్‌ లేదంటే కాలిక్యులేటర్‌, పెన్సిల్‌ లాంటి సాధనాలను ఉపయోగించకుండా తన మేధాశక్తితో అతను ఈ రికార్డు సృష్టించడం విశేషం. అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఉజ్జెయిల్‌, ఏ విషయాన్ని అయినా త్వరగా నేర్చుకుంటాడని, అది గమనించే తాము అతనికి మాటలు వచ్చిన నాటి నుంచే మ్యాథ్స్‌లో శిక్షణ అందిస్తున్నామని తల్లిదండ్రులు రీనా అజుబా, ఒకేష్‌ విక్టర్‌ తెలిపారు. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న రీనాకు గతంలో ఉన్న సింగిల్‌/డబుల్‌ డిజిట్స్‌ను కూడికలు చేసిన రికార్డు (వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు)ను ఉజ్జెయిల్‌ అధిగమించాడు. ఈ ఏడాది జూన్‌లో ఈ రికార్డ్సు కోసం ఇంటర్వ్యూ జరిగిందన్న రీనా, నవంబర్‌ 10న ఈ రికార్డు ఫీట్‌ చేశాడన్నారు. రాబోయే సంవత్సరాలలో మరిన్ని రికార్డులు సాధించేలా అతనికి శిక్షణ అందిస్తున్నామన్నారు.

Updated Date - 2022-11-26T10:41:30+05:30 IST