బీఆర్‌ఎస్‌ రాకతో అడ్డంకులు తొలగినట్లే

ABN , First Publish Date - 2022-11-12T03:18:24+05:30 IST

ఆర్‌ఎస్‌ పోయి బీఆర్‌ఎస్‌ రావడంతో అన్ని సమస్యలూ పరిష్కారమైనట్లేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ తాజాగా వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్‌ రాకతో అడ్డంకులు తొలగినట్లే

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధం

ప్రజల్లో మాపై అభిమానం చెక్కుచెదరలేదు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌

హైదరాబాద్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ పోయి బీఆర్‌ఎస్‌ రావడంతో అన్ని సమస్యలూ పరిష్కారమైనట్లేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ తాజాగా వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజల్లో టీడీపీపై అభిమానం చెక్కుచెదరలేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘‘జనంలో పార్టీపై అభిమానం ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా పార్టీ సిద్ధంగా ఉంది. తెలంగాణలో టీడీపీ ఉందా అని ప్రశ్నించేవారికి నేను ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా వచ్చిన జనమే సమాధానం. మా పార్టీని 40ఏళ్లుగా గుండెల్లో పెట్టుకుని కాపాడిన ప్రజల పట్ల మాకు పూర్తి బాధ్యత ఉంది. అన్నిస్థాయుల్లో పార్టీని పటిష్ఠం చేస్తాం. క్రమం తప్పకుండా పార్టీ సమీక్షలు, సంస్థాగత సమావేశాలు ఉంటాయి. జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీ పర్యటిస్తా’ అని కాసాని స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-12T03:18:24+05:30 IST

Read more