ఓబీసీలకు మోదీ ఏం చేసిండు?: వీహెచ్‌

ABN , First Publish Date - 2022-11-17T04:06:57+05:30 IST

బీసీ ప్రధాని అయిన నరేంద్రమోదీ గత 8 ఏళ్లలో ఓబీసీలకు ఏం చేశారంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు.

ఓబీసీలకు మోదీ ఏం చేసిండు?: వీహెచ్‌

హైదరాబాద్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): బీసీ ప్రధాని అయిన నరేంద్రమోదీ గత 8 ఏళ్లలో ఓబీసీలకు ఏం చేశారంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓబీసీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని, బీసీ కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపైన మోదీని నిలదీసేందుకు అన్ని రాజకీయ పార్టీలనూ ఏకం చేస్తానని తెలిపారు.

Updated Date - 2022-11-17T04:06:57+05:30 IST

Read more