హౌస్‌ కీపింగ్‌ మహిళపై వార్డు బాయ్‌ అత్యాచారం

ABN , First Publish Date - 2022-09-24T17:44:53+05:30 IST

దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళపై ఘోరం జరిగింది. నైట్‌డ్యూటీలో గదులను శుభ్రం చేస్తుండగా ఒంటరిగా ఉన్న ఆమెపై వార్డుబాయ్‌ అత్యాచారం

హౌస్‌ కీపింగ్‌ మహిళపై వార్డు బాయ్‌ అత్యాచారం

ఆలస్యంగా వెలుగులోకి  

పరారీలో వార్డు బాయ్‌

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌: దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళపై ఘోరం జరిగింది. నైట్‌డ్యూటీలో గదులను శుభ్రం చేస్తుండగా ఒంటరిగా ఉన్న ఆమెపై వార్డుబాయ్‌ అత్యాచారం జరిపాడు. మలక్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పురానాపూల్‌, జియాగూడ నివాసి మారుతి సందీప్‌(26) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో వార్డు బాయ్‌. అదే ఆస్పత్రిలో 43 ఏళ్ల మహిళ హౌజ్‌ కీపింగ్‌గా ఏడాదిన్నర నుంచి విధులు నిర్వహిస్తోంది. గత బుధవారం రాత్రి 11గంటల ప్రాంతంలో రెండో అంతస్తులో ఖాళీగా ఉన్న గదులు,  బెడ్‌లను శుభ్రం చేస్తుండగా గమనించిన సందీప్‌ గదిలోకి వెళ్లి ఆమెపై దాడి చేసి అత్యాచారం చేశాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దాంతో భయపడిన బాధిత మహిళ శుక్రవారం ఉదయం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌, తన సిబ్బందితో హుటాహుటీన ఆస్పత్రికి వెళ్లి వివరాలను సేకరించాడు. సందీప్‌ ఉదయం వేళ్లలో మరో ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్‌ అక్కడికి వెళ్లే సరికి పారిపోయాడు. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Read more