Voter registration: ఓటర్‌ నమోదుకు డిసెంబర్‌ 8 ఆఖరు

ABN , First Publish Date - 2022-11-20T12:25:50+05:30 IST

జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు ఓటరుగా డిసెంబర్‌ 8లోగా పేరు నమోదు చేసుకోవాలని

Voter registration: ఓటర్‌ నమోదుకు డిసెంబర్‌ 8 ఆఖరు

హైదరాబాద్‌ సిటీ: జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు ఓటరుగా డిసెంబర్‌ 8లోగా పేరు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ సూచించారు. ఇప్పటికే ఓటరైన వారు, సవరణ ముసాయిదా జాబితాలో పేరుందా, లేదా చెక్‌ చేసుకోవాలన్నారు. పేరుంటే ఓటర్‌ గుర్తింపుకార్డుతో ఆధార్‌ నెంబర్‌ అనుసంధానం చేసుకోవాలన్నారు. www.nvsp.in, ceo.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో పేరు నమోదు, అనుసంధానానికి అవకాశ ఉందని లోకేష్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-11-20T12:25:51+05:30 IST