గంగ ఒడికి గజాననుడు

ABN , First Publish Date - 2022-09-11T05:51:58+05:30 IST

వినాయక నిమజ్జన శోభాయాత్ర శనివారం వైభవంగా సాగిందివినాయక నిమజ్జన శోభాయాత్ర శనివారం వైభవంగా సాగింది

గంగ ఒడికి గజాననుడు
ట్యాంక్‌బండ్‌కు తరలిన వినాయక విగ్రహాలు


 వైభవంగా నిమజ్జనన

 అధినాయకా.. వీడ్కోలిక అన్న భక్తజనం  వర్షంలోనూ కొనసాగిన శోభాయాత్ర

నృత్యాలతో సందడిచేసిన యువత  

లడ్డూ వేలం.. నోట్ల వర్షం

పోటాపోటీగా ప్రసాదాల పంపిణీ

- కవాడిగూడ, ఆంధ్రజ్యోతి

వినాయక నిమజ్జన శోభాయాత్ర శనివారం వైభవంగా సాగింది. గంగమ్మ చెంతకు గణనాథుడు తరలిపోతుండడంతో తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వక్రతుండాయ.. వినాయకా అంటూ సందడి చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో గణనాథుడిని ఉంచి  నిమజ్జనోత్సవానికి తరలించారు. అంబర్‌పేట, ముషీరాబాద్‌ నియోజకవర్గాల్లో వినాయక ప్రతిమలను మండపాల నిర్వాహకులు ఊరేగించగా, మహా గణపతికి మహిళలు పెద్ద   ఎత్తున హారతిపట్టారు. కొన్నిచోట్ల మండపాల నిర్వాహకులు లడ్డూ వేలంపాటలు ఉత్సాహంగా నిర్వహించగా, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మికవేత్తలు ప్రసాదాలను, తాగునీటిని పోటీపడి అందజేశారు. ట్యాంక్‌బండ్‌ హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనోత్సవం ఘనంగా ముగిసింది.Read more