ఆ అన్నం కేసీఆర్ తింటే విద్యార్థుల ఇబ్బందులు తెలుస్తాయి: విజయశాంతి

ABN , First Publish Date - 2022-04-11T01:39:12+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ‌లోని గురుకులాలకు సన్న బియ్యం అందిస్తామ‌ని గొప్పలు చెప్పిన కేసీఆర్ దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.

ఆ అన్నం కేసీఆర్ తింటే విద్యార్థుల ఇబ్బందులు తెలుస్తాయి: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ‌లోని గురుకులాలకు సన్న బియ్యం అందిస్తామ‌ని గొప్పలు చెప్పిన కేసీఆర్ దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. అన్నం ముద్దముద్దగా, బంకబంకగా ఉండటంతో తినలేక విద్యార్ధులు తిప్పలు పడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఒకసారి ఆ అన్నం తింటే విద్యార్థుల ఇబ్బందులేంటో తెలుస్తాయన్నారు. ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లకు నూక బియ్యం, దొడ్డు బియ్యం పంపుతుండగా... ఇప్పుడు గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థుల తిండితో ఆట‌లాడవద్దని విజయశాంతి సూచించారు.  Read more