జూపార్కులో సిబ్బందికి రెండురోజుల శిక్షణ

ABN , First Publish Date - 2022-12-13T00:44:49+05:30 IST

క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది అడవి జంతువుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని జూపార్కు క్యూరేటర్‌ ఎస్‌.రాజశేఖర్‌ అన్నారు.

జూపార్కులో సిబ్బందికి రెండురోజుల శిక్షణ

మదీన, డిసెంబర్‌ 12(ఆంరఽధజ్యోతి): క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది అడవి జంతువుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని జూపార్కు క్యూరేటర్‌ ఎస్‌.రాజశేఖర్‌ అన్నారు. అటవీశాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి సోమవారం జూపార్కులో శిక్షణా శిబిరం నిర్వహించారు. ‘‘వన్యప్రాణుల సంరక్షణ- మనిషి, జంతువు సంఘర్షణ’’ అనే అంశంపై రెండురోజులపాటు జరిగే శిక్షణలో వివిధ జిల్లాలో పనిచేస్తున్న 55మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్భంగా క్యూరేటర్‌ మాట్లాడుతూ, ఈ శిక్షణా శిబిరాన్ని క్షేత్రస్థాయిసిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొదటిరోజు జంతువులకు మత్తు మందు ఇచ్చే విధానం గురించి డిప్యూటీ డైరెక్టర్‌ (వెటర్నరీ) ఎం.ఎ హకీమ్‌ వివరించారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ క్యూరేటర్‌ శంకరన్‌, డిప్యూటీ క్యూరేటర్‌ నాగమణి, అసిస్టెంట్‌ క్యూరేటర్లు శ్రీదేవి సరస్వతి, లక్ష్మణ్‌, రేంజ్‌ఆఫీసర్‌ డి.నాగరాజు, పీఆర్‌ఓ హనీఫుల్లా పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:44:49+05:30 IST

Read more