TS News: బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్‌గా సునీల్ బన్సల్

ABN , First Publish Date - 2022-09-30T01:03:19+05:30 IST

Hyderabad: బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్‌గా సునీల్ బన్సల్‌ను నియమించారు. అక్టోబర్ ఒకటో తేదీన ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన పలువురు నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. హైదరాబాద్ శివారు పెద్దఅంబర్పేటలో మునుగోడు ఉపఎన్నికపై పార్టీ నేతలతో భేటీకానున్నారు. మునుగోడు ఉపఎన్నిక కమిటీ, మండల ఇన్చార్జ్లు, మండల సమన్వయ కమిటీలతో సునీల్ బన్సల్ సమావేశమవుతారు.

TS News: బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్‌గా సునీల్ బన్సల్

Hyderabad: బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్‌గా సునీల్ బన్సల్‌ను నియమించారు. అక్టోబర్ ఒకటో తేదీన ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన పలువురు నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. వివేక్ వెంకటస్వామి చైర్మన్‌గా ఉన్న మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీతో భేటీకానున్నారు. హైదరాబాద్ శివారు పెద్దఅంబర్పేటలో మునుగోడు ఉపఎన్నికపై పార్టీ నేతలతో ఈ భేటీ జరగనుంది. మునుగోడు ఉపఎన్నిక కమిటీ, మండల ఇన్చార్జ్లు, మండల సమన్వయ కమిటీలతో సునీల్ బన్సల్ సమావేశమవుతారు. మునుగోడు ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించనున్నారు.

Read more