TS News: నగర వ్యాప్తంగా భారీ వర్షం

ABN , First Publish Date - 2022-09-27T01:07:33+05:30 IST

Hyderabad : నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. యూసఫ్ గూడా, పంజాగుట్ట, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై నిలిచిపోయిన వర్షం నీటితో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిం

TS News: నగర వ్యాప్తంగా భారీ వర్షం

Hyderabad : నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. యూసఫ్ గూడా, పంజాగుట్ట, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై నిలిచిపోయిన వర్షం నీటితో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నాంపల్లి, గోశామహల్, ఖైరతాబాద్, కోఠి, బషీర్‌భాగ్ నారాయణ గూడ, అఫ్జల్ గంజ్, మల్లెపల్లిలో నాలాలు పొంగిపొర్లాయి. వర్షం నీటితో రోడ్డు నిండిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.  

Updated Date - 2022-09-27T01:07:33+05:30 IST