లోక్‌సభ, రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

ABN , First Publish Date - 2022-04-05T19:20:28+05:30 IST

న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు.

లోక్‌సభ, రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. ధాన్యం సేకరణపై నోటీసులు ఇచ్చిన ఎంపీలు ఉభయ సభల్లో చర్చకు పట్టుపట్టారు. ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అయితే దీనిపై ఉభయ సభల్లోనూ చర్చకు అనుమతి ఇవ్వలేదు. దీంతో లోక్‌సభ, రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. 


ఒడిషాతోపాటు మరికొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం విధానంతో ఇబ్బందులుపడుతున్నాయని ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి రాజ్యసభలో డిమాండ్ చేశారు. కేంద్రం ఈ అంశంపై సమాధానం ఇవ్వాలన్నారు. అయితే వారం రోజుల నుంచి ఈ డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజూ వాయిదా తీర్మానం ఇస్తున్నప్పటికీ ఉభయ సభల్లో చర్చకు అనుమతించడంలేదు. ఈ నెల 11న ఢిల్లీలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. 

Read more