Tragedy at NTR family: ఎన్‌టీఆర్‌ నాలుగవ కుమార్తె హఠాన్మరణం

ABN , First Publish Date - 2022-08-01T20:32:53+05:30 IST

ఎన్‌టీఆర్‌ (NTR) నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరీ హఠాన్మరణం చెందారు.

Tragedy at NTR family: ఎన్‌టీఆర్‌ నాలుగవ కుమార్తె హఠాన్మరణం

హైదరాబాద్ (Hyderabad): ఎన్‌టీఆర్‌ (NTR) నాలుగవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరీ (Umamaheswari) హఠాన్మరణం చెందారు. దీంతో ఎన్‌టీఆర్‌ కుటుంబంలో విషాదం అలుముకుంది. సమాచారం తెలుసుకున్న ఎన్‌టీఆర్‌ కుటుంబ సభ్యులు ఉమా మహేశ్వరీ ఇంటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే నారా లోకేష్ (Nara Lokesh)  ఉమా మహేశ్వరీ ఇంటికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు (Chandrababu Family) కూడా వెళ్లనున్నారు. విదేశాల్లో ఉన్న ఎన్‌టీఆర్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఉమామహేశ్వరీ హఠాన్మరణంతో ఎన్‌టీఆర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Updated Date - 2022-08-01T20:32:53+05:30 IST