TS News.. హైదరాబాద్: వాహనదారులు గీత దాటితే బాదుడే...

ABN , First Publish Date - 2022-10-03T17:21:30+05:30 IST

హైదరాబాద్ (Hyderabad): జంటనగరాల్లో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చేశాయి.

TS News.. హైదరాబాద్: వాహనదారులు గీత దాటితే బాదుడే...

హైదరాబాద్ (Hyderabad): జంటనగరాల్లో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చేశాయి. గీత దాటితే వారి తాట తీసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100 ఫైన్‌ విధించనున్నారు. ఫ్రీలెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.1,000 వరకు జరిమానా వేస్తారు. ఫుట్‌పాత్‌లపై దుకాణందారులు ఆక్రమిస్తే వారి జేబులు ఖాళీ అవ్వడం ఖాయం. పాదచారులకు ఆటంకం కలిగేలా వాహనాలు నిలిపితే రూ.600 జరిమానా వేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిబంధనలు పాటించనివారికి జరిమానాలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు నిబంధనలు పాటించి సహకరించాలని కోరుతున్నారు.


హైదరాబాద్ నగరంలో రోడ్డపై వాహనాలు రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. ఫలితంగా రోడ్లపై ప్రధాన మార్గాల్లో ట్రిఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతకు ముందు పబ్లిక్ ట్రాన్స్ ఫోర్టు వాడేవారు కూడా కోవిడ్ తర్వాత సొంత వాహనాలకు అలవాటుపడ్డారు. అయితే దిగు, మధ్య తరగతి ప్రజలు కూడా తంటాలుపడి సొంత వాహనాలు కొనుక్కున్నవారూ ఉన్నారు. దీంతో ప్రస్తుతం నగరంలో ప్రతి రోజు 80 లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల లెక్కల్లో తేలింది.

Updated Date - 2022-10-03T17:21:30+05:30 IST