MLAs poaching case: వారిద్దరినీ అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు

ABN , First Publish Date - 2022-11-24T15:38:14+05:30 IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు(MLAs poaching case)లో సిట్ అధికారుల నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టు(High court)లో పిటిషన్ దాఖలైంది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులను

MLAs poaching case: వారిద్దరినీ అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు
అరెస్ట్ చేయొద్దు..

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు(MLAs poaching case)లో సిట్ అధికారుల నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టు(High court)లో పిటిషన్ దాఖలైంది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ అంబర్‌పేట్ అడ్వకేట్ ప్రతాప్‌కుమార్, నందు భార్య చిత్ర లేఖ పిటిషన్ వేశారు. తమకు ఎలాంటి సంబంధం లేని కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం 41ఏ సీఆర్‌పీసీ ప్రకారం విచారణకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. అరెస్ట్ మాత్రం చేయొద్దని సిట్ అధికారులకు కోర్టు ఆదేశించింది. దీంతో రేపు సిట్ విచారణకు ప్రతాప్ కుమార్, నందు భార్య చిత్ర లేఖ హాజరుకానున్నారు.

Updated Date - 2022-11-24T15:38:14+05:30 IST

Read more