ఆది హోండా షో రూంలో చోరీ

ABN , First Publish Date - 2022-08-31T16:47:17+05:30 IST

హయత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఆది హోండా షోరూంలో చోరీ జరిగింది. ఆనంద్‌నగర్‌ కాలనీలో ఆది హోండా షోరూం ఉంది. పని ముగిసిన తరువాత సోమవారం

ఆది హోండా షో రూంలో చోరీ

హైదరాబాద్/హయత్‌నగర్‌: హయత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఆది హోండా షోరూంలో చోరీ జరిగింది. ఆనంద్‌నగర్‌ కాలనీలో ఆది హోండా షోరూం ఉంది. పని ముగిసిన తరువాత సోమవారం రాత్రి 9 గంటల 40 నిమిషాలకు షోరూం ఇన్‌చార్జి నతాల సందీ్‌పరెడ్డి షోరూంకు తాళం వేసి సెక్యూరిటీ గార్డు బొక్క శ్రీహరికి ఇచ్చాడు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు సర్వీస్‌ అడ్వయిజర్‌ వచ్చి సెక్యూరిటీ గార్డు నుంచి తాళం తీసుకుని షోరూం తెరిచాడు. స్వీపర్‌ వచ్చి షోరూం ఊడ్చడానికి లోనికి వెళ్లగా క్యాష్‌ కౌంటర్‌ తెరిచి ఉంది. ఈ విషయాన్ని వెంటనే స్వీపర్‌ షోరూం ఇన్‌చార్జి సందీ్‌పరెడ్డికి ఫోన్‌ ద్వారా చెప్పారు. వెంటనే సందీ్‌పరెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. దుండగులు సీసీ కెమెరాలు పని చేయకుండా కనెక్షన్‌లు తొలగించారు. గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్‌ తెరిచి క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న రూ. లక్షా 40 వేలు అపహరించుకు పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more