ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2022-12-10T00:36:51+05:30 IST

ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి

సికింద్రాబాద్‌, డిసెంబర్‌ 9(ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం చేపడుతున్న వివిఽ ద ప్రాజెక్టు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో చేపడుతున్న ఆయా ప్రాజెక్టులను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత లాలాపేటలో నిర్మిస్తున్న స్విమ్మింగ్‌ పూల్‌ పనులను పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ స్విమ్మింగ్‌పూల్‌ను వివిధ పోటీలకు సైతం తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పనులు ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. లాలాపేట, అడ్డగుట్టలో నిర్మిస్తున్న ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణ పనుల గురించి పద్మారావు ఆరా తీశారు.

Updated Date - 2022-12-10T00:36:51+05:30 IST

Read more