షర్మిల అరెస్టు తీరు ఆందోళనకరం

ABN , First Publish Date - 2022-11-30T02:25:26+05:30 IST

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి వై.ఎ్‌స.రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వై.ఎ్‌స.షర్మిలను హైదరాబాద్‌

షర్మిల అరెస్టు తీరు ఆందోళనకరం

రాజకీయ వైరుధ్యాలు ఎలా ఉన్నా ఒక మహిళను గౌరవించాల్సింది

కారులో ఉండగానే టోయింగ్‌ చేయడం చూసి కలతచెందా

గవర్నర్‌ తమిళిసై ఆందోళన

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి వై.ఎ్‌స.రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వై.ఎ్‌స.షర్మిలను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన తీరుపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ వైరుధ్యాలు.. పార్టీల సిద్ధాంతాలు ఎలా ఉన్నా.. ఒక మహిళను.. పార్టీ నాయకురాలి పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాల్సిందని అభిప్రాయపడ్డారు. షర్మి ల కారులో ఉండగానే.. ఆ కారును టోయింగ్‌ చేస్తూ తరలించే దృశ్యాలను చూసి తీవ్రంగా కలతచెందానన్నారు. షర్మిల భద్రత, ఆమె ఆరోగ్యంపై గవర్నర్‌ ఆందోళన చెందినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించాయి.

Updated Date - 2022-11-30T02:26:10+05:30 IST

Read more