పేద మహిళలను సంపన్నులను చేయడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-12-30T03:37:19+05:30 IST

పేద మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించి, వారిని సంపన్నులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

పేద మహిళలను సంపన్నులను చేయడమే లక్ష్యం

స్త్రీనిధి మేనేజింగ్‌ సభ్యులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హైదరాబాద్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): పేద మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించి, వారిని సంపన్నులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్త్రీనిధితో సత్ఫలితాలు వస్తున్నాయని, మహిళల ఆర్థిక సాధికారత పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని స్త్రీనిధి జిల్లా సమాఖ్య అధ్యక్షులు, బ్యాంక్‌ డైరెక్టర్లు గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్త్రీనిధి బ్యాంకు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యకలాపాలు, భవిష్యత్‌ ప్రణాళికల గురించి మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 5.5 లక్షల స్వయం సహాయక సంఘాలలో 56 లక్షల మంది మహిళలున్నారని, రుణాలు అందించడంలో, ఆర్థిక చేయుతనివ్వడంలో మరింత శక్తిమంతంగా పనిచేసేందుకు స్త్రీనిధి రుణాలు పెంచాలని మంత్రిని కోరారు.

Updated Date - 2022-12-30T03:37:19+05:30 IST

Read more