Terrorism: హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర.. సీసీఎస్ ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు

ABN , First Publish Date - 2022-10-03T20:56:26+05:30 IST

పాకిస్థాన్‌ (Pakistan) నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) ప్రేరేపిత ఉగ్రవాదులు హైదరాబాద్‌ నగరంపై మళ్లీ గురి పెట్టారు.

Terrorism: హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర.. సీసీఎస్ ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు

హైదరాబాద్‌ (Hyderabad): పాకిస్థాన్‌ (Pakistan) నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) ప్రేరేపిత ఉగ్రవాదులు హైదరాబాద్‌ నగరంపై మళ్లీ గురి పెట్టారు. రద్దీ ప్రదేశాలే లక్ష్యంగా గ్రనేడ్‌ (Grenade) దాడులు చేసేందుకు కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి.. ఉగ్ర కుట్రను భగ్నం చేశారు.  సీసీఎస్ ఎఫ్ఐఆర్‌‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సీసీఎస్ కేసును సిట్‌కు బదిలీ చేసింది. బీజేపీ (BJP), ఆర్ఎస్ఎస్ (RSS) కార్యక్రమాలు, దసరా ఉత్సవాలను జాహిద్ అండ్ టీమ్ టార్గెట్ చేసింది. దసరా రోజు జరిగే ఉత్సవాల్లో వరుస పేలుళ్లకు భారీ కుట్ర పన్నింది. A1 జాహిద్, A2 సమీ ఉద్ధిన్, A3 హజీ హసన్‌ల సీపీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.


నిందితులపై సెక్షన్ 18, 18(B), 20 ఆఫ్ 1967 యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అలాగే అదీల్ అఫ్రోజ్, అబ్దుల్ హై, సోహెల్ ఖురేషి, అబ్దుల్ కలీమ్‌లపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో దాడుల కోసం పాకిస్థాన్ బేస్ హండ్లర్స్ నుంచి గ్రనేడ్స్ తీసుకువచ్చారు. నిర్మాణుష్య ప్రాంతంలో హ్యాండ్ గ్రనేడ్ పేల్చేందుకు ట్రయల్ నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో సైతం జాహిద్‌ అండ్ టీంపై పలు టెర్రరిస్ట్ కుట్ర కేసులు ఉన్నాయి. సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో విచారణ అనంతరం వారిని గాంధీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి.. రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-10-03T20:56:26+05:30 IST