TS News: తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా చింత ప్రభాకర్

ABN , First Publish Date - 2022-09-28T17:19:17+05:30 IST

తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్...

TS News: తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా చింత ప్రభాకర్

హైదరాబాద్ (Hyderabad): నారాయణ గూడ టెస్కో కార్యాలయంలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ (Chinta Prabhakar).. మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప అవకాశం కల్పించారని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి సంస్థకు మంచిపేరు తేవాలని మంత్రులు ఆకాక్షించారు.


ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ (CM KCR) సమాన ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. చదువుకొనే రోజుల నుంచి ముఖ్యమంత్రికి చేనేత కార్మికుల సమస్యలు తెలుసునని అన్నారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన తన లాంటి వాళ్ళకు సీఎం కేసీఆర్ అనేక పదవులు ఇచ్చి గౌరవించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

Updated Date - 2022-09-28T17:19:17+05:30 IST