కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ నెంబర్‌ వన్‌

ABN , First Publish Date - 2022-12-13T00:17:14+05:30 IST

కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందున్నదని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ నెంబర్‌ వన్‌
కళాకారులను సత్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

  • మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రవీంద్రభారతి, డిసెంబర్‌ 12(ఆంధ్రజ్యోతి): కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందున్నదని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అభినయ థియేటర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల జాతీయ నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలి రోజు మణిపూర్‌కు చెందిన కళాకారులు రిక్షా అమాసంగ్‌ నాంగ్మీ నాటకం ప్రదర్శించారు. ఈ నాటకానికి డా. ఎస్‌.థనింలెయమ దర్శకత్వం వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ కళాకారులను సత్కరించి నాటకోత్సవ నిర్వాహకులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులను నగరానికి రప్పించి జాతీయ నాటకోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు తమకమళ్ల రామచంద్రారావు, బి.ఎం.రెడ్డి, పద్మప్రియ పాల్గొని నాటకోత్సవ నిర్వాహకుడు అభినయ శ్రీనివా్‌సను అభినందించారు. సభకు ముందు ప్రదర్శించిన నాటకం ప్రేక్షకుల్ని అలరించింది.

Updated Date - 2022-12-13T00:17:14+05:30 IST

Read more