Khairatabad Maha Ganapatiకి తొలిపూజ నిర్వహించిన గవర్నర్ తమిళిసై

ABN , First Publish Date - 2022-08-31T16:07:44+05:30 IST

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు.

Khairatabad Maha Ganapatiకి తొలిపూజ నిర్వహించిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: వినాయక చవితి (Vinayaka chaviti festival) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Tamilisi) ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad maha ganapati)ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహాగణపతికి గవర్నర్ (Telangana governor) తొలిపూజ చేశారు. అనంతరం తమిళిసై మాట్లాడుతూ... అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరిని ఐకమత్యంగా ఉంచేదే గణేష్ ఉత్సవాలు అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam nagender) పాల్గొన్నారు.


మరోవైపు ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గణపయ్య దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా  ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలిసారి 50 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష మండపం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మహాగణపతి దర్శనానికై భక్తుల కోసం నిర్వాహకులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 


భారీ భద్రత...

కాగా... ఖైరతాబాద్‌లో మహా గణపతి కొలువుదీరిన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.  గణేష్ మండపం ఎదురుగా ఉన్న ప్రదాన నాలుగు రహదారులు నిఘా నీడలోకి వెళ్లాయి. 9 ప్రధాన మెటల్ డిటెక్టర్స్‌తో క్షుణ్ణంగా తనిఖీ తరువాతే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఈ సారి భారీ భద్రత సెక్యూరిటి వింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. మూడు షిఫ్ట్‌లో 360 పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. క్రైమ్‌ టీమ్స్‌, షీటీమ్స్‌, సిటీ కమాండోస్, క్విక్ రియాక్షన్ టీంమ్స్, ఐడీ పార్టీలు, టీఎస్ పోలీస్ బెటాలియన్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలతో పాటు షాడో టీంమ్స్  రంగంలోకి దిగాయి. 70 అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని వెల్ నెస్ సెంటర్ హాస్పిటల్‌లో సెంట్రల్ జోన్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసందానం చేశారు. 

Updated Date - 2022-08-31T16:07:44+05:30 IST