CJI NV Ramana: హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట.. తీపికబురు చెప్పిన సీజేఐ

ABN , First Publish Date - 2022-08-25T19:40:50+05:30 IST

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టు (Supreme Court)లో ఊరట లభించింది.

CJI NV Ramana: హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట.. తీపికబురు చెప్పిన సీజేఐ

ఢిల్లీ (Delhi): హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. పదవీ విరమణకు ఒక రోజు ముందు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) తీపికబురు చెప్పారు. జర్నలిస్టుల (Journalists) ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ (Green signal) ఇచ్చారు. సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్‌ జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో గురువారం విచారణ జరిగింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని సీజేఐ అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి తాను మాట్లాడ్డం లేదన్నారు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలన్నారు. రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. వారికి భూమి కేటాయించారు.. కానీ అభివృద్ధి చేయలేదని, వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారన్నారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి తాము అనుమతిస్తున్నామని,   వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చునని ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయండని సీజేఐ ఎన్వీ రమణ సూచించారు.

Updated Date - 2022-08-25T19:40:50+05:30 IST