అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-07T18:05:28+05:30 IST

అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంబర్‌పేట, చెన్నారెడ్డినగర్‌కు చెందిన రమేష్‌, మేఘన భార్యాభర్తలు. రమేష్‌ బొల్లారంలోని సోలార్‌

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్/అంబర్‌పేట: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంబర్‌పేట, చెన్నారెడ్డినగర్‌కు చెందిన రమేష్‌, మేఘన భార్యాభర్తలు. రమేష్‌ బొల్లారంలోని సోలార్‌ కంపెనీలో, మేఘన ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పనిచేస్తోంది. రమేష్‌ భార్యను స్కూల్‌ నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు సోమవారం మధ్యాహ్నం స్కూల్‌కు రాకపోవడంతో మేఘన తన మరిదికి ఫోన్‌ చేసి చెప్పింది. ఇంటికి వెళ్లి చూడగా రమేష్‌ పడకగదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతడ్ని కిందికి దింపి చూడగా అప్పటికే మృతిచెందాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రమేష్‌ సూసైడ్‌ నోట్‌ రాశాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అంబర్‌పేట సీఐ పేరం సుధాకర్‌ తెలిపారు.

Read more