TS News: హైదరాబాద్ ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం

ABN , First Publish Date - 2022-10-11T16:38:56+05:30 IST

హైదరాబాద్ ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.

TS News: హైదరాబాద్ ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్: హైదరాబాద్ ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈరోజు నిందితుల కస్టడి పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై సిట్ ఆరా తీయనుంది. జాహిద్‌కు చేరిన నగదు, హాండ్ గ్రానేడ్స్ నెట్వర్క్‌పై ఆరా తీస్తోంది. పాకిస్థాన్ నుండి మహారాష్ట్ర మీదుగా గ్రానేడ్స్ హైదరాబాద్‌కు చేరాయి. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాది ఫర్హతుల్లా గౌరీ నెట్వర్క్ ట్రేస్‌ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఎంతమందిని ఉగ్రవాదం వైపు మళ్లించారు అన్న కోణంలో పోలీసులు విచారించనున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని ఉగ్రకుట్ర కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. జాహిద్, మాజా‌, సమీ నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. 

Read more