బడా గణేశుడి గుర్తింపు వెనక సింగరి సుదర్శన్‌ కృషి

ABN , First Publish Date - 2022-10-02T17:39:14+05:30 IST

గణేశ్‌ ఉత్సవాల్లో బడా గణేశుడు ప్రత్యేక గుర్తింపు పొంద డం వెనక ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌ కృషి ఎంతో ఉంది. ఆయన మృతితో ఖైరతాబాద్‌

బడా గణేశుడి గుర్తింపు వెనక సింగరి సుదర్శన్‌ కృషి

హైదరాబాద్/ఖైరతాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో బడా గణేశుడు ప్రత్యేక గుర్తింపు పొంద డం వెనక ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌ కృషి ఎంతో ఉంది. ఆయన మృతితో ఖైరతాబాద్‌ మూగబోయింది. హోలీ, దీపావళి, బతుకమ్మ, దసరా, సంక్రాంతి తదితర ఏ పండగలు వచ్చినా అందరినీ కలుపుకొని వెళ్లి వైభవంగా నిర్వహించేవారు. తన సోదరుడు సింగరి శంకరయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న సుదర్శన్‌ ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు. అంతేకాకుండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్‌ శిక్షణ, ఉచిత స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు నిర్వహించి వందలాది మందికి ఉపాధి కల్పించిన సుదర్శన్‌ మృతితో ఖైరతాబాద్‌లో విషాదం అలుముకుంది. స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి ఆయనకు సంఘీభావం తెలిపారు. ఆయన అంతిమ యాత్రలో యావత్‌ ఖైరతాబాద్‌ పాల్గొంది. అడుగడుగునా పూల మాలలు, శాలువాలు వేసి నివాళులర్పించారు. 

Read more