షార్ట్‌ సర్క్యూట్‌తో ఏడు ఆవులు మృతి

ABN , First Publish Date - 2022-10-14T17:06:47+05:30 IST

నగరంలో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి షాహినాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌కు ఆనుకొని ఉన్న బాల మైసమ్మ గోశాల పక్కనున్న చెట్టుపై విద్యుత్‌ తీగ పడడంతో షార్ట్‌

షార్ట్‌ సర్క్యూట్‌తో ఏడు ఆవులు మృతి

43 ఆవులను రక్షించిన పోలీసులు

హైదరాబాద్/మంగళ్‌హాట్‌: నగరంలో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి షాహినాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌కు ఆనుకొని ఉన్న బాల మైసమ్మ గోశాల పక్కనున్న చెట్టుపై విద్యుత్‌ తీగ పడడంతో షార్ట్‌ సర్క్యూట్‌తో ఏడు ఆవులు మృతి చెం దాయి. సకాలంలో పోలీసులు స్పందిం చి 43 ఆవులను రక్షించగలిగారు. గోశాల నిర్వాహకుడు రాజ్‌కుమార్‌ బుధవా రం రాత్రి 10గంటలకు తాళం వేసి వెళ్లాడు. భారీ వర్షానికి తెల్లవారు జా మున సమీపంలోని విద్యుత్‌ స్తం భం నుంచి మంటలు లేచి విద్యు త్‌ తీగ పక్కనున్న చెట్టుకు తగిలి షార్ట్‌సర్క్యూట్‌ ఏర్పడింది. దీంతో ఏడు ఆవులు మృతి చెందాయి. మిగిలిన ఆవులు పెద్ద ఎత్తున అరవడంతో షాహినాయత్‌గంజ్‌ ఎస్‌ఐ రాఘవేంద్ర, సిబ్బంది సకాలంలో స్పందించారు. విద్యుత్‌ సిబ్బందికి సమాచార మందించి సరఫరా నిలిపి వేయించి మిగిలిన 43 ఆవులను కాపాడారు. మృతి చెందిన ఆవులను జీహెచ్‌ఎంసీ సిబ్బంది గురువారం మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో తరలించారు. మిగిలిన ఆవులకు పశు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గోశాల నిర్వాహకుడు రాజ్‌కుమార్‌ ఫిర్యాదుతో పోలీసు లు కేసు నమోదు చేశారు.

Read more