వర్సిటీలు పరిశోధనలను ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2022-10-02T17:37:17+05:30 IST

శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిలో విశ్వవిద్యాలయాలదే కీలక పాత్ర అని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌ అన్నారు. విశ్వవిద్యాలయాలు పరిశోధనలను ప్రోత్సహించాలని సూచించారు.

వర్సిటీలు పరిశోధనలను ప్రోత్సహించాలి

జేఎన్‌టీయూహెచ్‌  

గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో వీకే సారస్వత్‌

హైదరాబాద్‌ సిటీ: శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిలో విశ్వవిద్యాలయాలదే కీలక పాత్ర అని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌ అన్నారు. విశ్వవిద్యాలయాలు పరిశోధనలను ప్రోత్సహించాలని సూచించారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌ గోల్డెన్‌ జూబ్లీ ముగింపు వేడుకల్లో వీకే సారస్వత్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంజనీరింగ్‌ విద్యా విధానంలో జేఎన్‌టీయూహెచ్‌ సమూల మార్పులు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. దేశంలోని అనేక వర్సిటీలకు జేఎన్‌టీయూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. యూనివర్సిటీలు కేవలం విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను పెంచి వారు సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాయన్నారు. జేఎన్‌టీయూ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా పూర్వ వీసీలు, రిజిస్ట్రార్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూహెచ్‌ వీసీ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ర్టార్‌ మంజూరు హుస్సేన్‌, రెక్టార్‌ గోవర్ధన్‌ పాటు పలు విభాగాల ప్రొఫెసర్లు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. 

Read more