హక్కుల సాధనకు ఉద్యమాలు

ABN , First Publish Date - 2022-08-01T06:01:45+05:30 IST

పోరాడి సాధించుకున్న హక్కుల పరిరక్షణకు, కనీస వేతన చట్టం అమలుకు

హక్కుల సాధనకు ఉద్యమాలు
అల్వాల్‌లో నిర్వహించిన మహాసభ ప్రదర్శనలో ఏఐటీయూసీ నాయకులు

అల్వాల్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): పోరాడి సాధించుకున్న హక్కుల పరిరక్షణకు, కనీస వేతన చట్టం అమలుకు, ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడానికి రాబోయే రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎండీ యూసఫ్‌ పిలుపు నిచ్చారు. ఏఐటీయూసీ మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా 3వ మహాసభ ఆదివారం వెంకటాపురం అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు పెంచాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ మేడ్చల్‌జిల్లా అధ్యక్షుడు రవిచందర్‌ మాట్లాడుతూ అసంఘటిత భవన నిర్మాణ రంగ కార్మికులు, హమాలీల కోసం సంక్షేమ పథకాలను అమలు కోసం ఏఐటీయూసీ పోరాటం చేస్తోందన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌రావు అధ్యక్షతన వహించిన మహాసభలో రాష్ట్ర మున్సిపల్‌ కార్మికుల సంఘం అధ్యక్షుడు ఏసురత్నం, తులసీ, కృష్ణా, మహేందర్‌, శేఖర్‌, తిరుపతి, ఉమామహేశ్‌, సహదేవ్‌, రొయ్యల కృష్ణమూర్తి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-01T06:01:45+05:30 IST