Reduced minimum temperatures: పెరిగిన చలి తగ్గిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ABN , First Publish Date - 2022-11-28T07:30:05+05:30 IST

నగరంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Reduced minimum temperatures: పెరిగిన చలి తగ్గిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గుతుండడంతో స్థానికులు చలితో వణికిపోతున్నారు. ఆదివారం గ్రేటర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15.7 డిగ్రీలుండగా, పటాన్‌చెరులో 13.8, రాజేంద్రనగర్‌లో 13.9, సికింద్రాబాద్‌లో 14.3, అల్వాల్‌లో 14.4, సరూర్‌నగర్‌లో 14.9, ఎల్‌బీనగర్‌లో 15.3 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-11-28T07:30:06+05:30 IST