మహా నగరాన్ని వీడని వర్షం : హైదరాబాద్‌లో వర్షపాత వివరాలు..

ABN , First Publish Date - 2022-07-29T22:58:54+05:30 IST

Hyderabad: తెలంగాణను వర్షాలు ముంచెతుతున్నాయి. రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మూసీనది పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నదిని

మహా నగరాన్ని వీడని వర్షం : హైదరాబాద్‌లో వర్షపాత వివరాలు..

Hyderabad: తెలంగాణను వర్షాలు (Rains) ముంచెతుతున్నాయి. రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మూసీనది (Musi river) పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నదిని ఆనుకుని ఉన్న కాలనీల లోని ఇళ్లలోని నీరు ప్రవేశించాయి. హైదరాబాద్ మహా నగరాన్ని వర్షం వీడేలా కనిపించడం లేదు. నిన్న, మొన్న కాస్త వెల్లడించినా.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం నుంచి ముసురు కమ్మేసింది. కాసేపటికే వర్షం కురవడంతో రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నేరేడ్‌మెట్‌లో 7.3 సెంటీమీటర్లు, మల్కాజ్‌గిరిలో 5.1, బాల్‌నగర్‌లో 5, అల్వాల్‌లో 4.8సె.మీ. వర్షపాతం నమోదైంది. మరో గంట పాటు హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) డిజాస్టర్ బృందాలను అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. 

Updated Date - 2022-07-29T22:58:54+05:30 IST