కుత్బుల్లాపూర్‌లో 17 రహదారులకు ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2022-11-21T00:30:15+05:30 IST

కుత్బుల్లాపూర్‌ రోడ్లకు ఎమ్మెల్యే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

కుత్బుల్లాపూర్‌లో 17 రహదారులకు ప్రతిపాదనలు

పేట్‌బషీరాబాద్‌, నవంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్‌ రోడ్లకు ఎమ్మెల్యే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఈ నెల 17న ప్రగతిభవన్‌లోన్‌లో రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల్లో రోడ్లు, వాటి అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రూ. 19.99 కోట్లతో 17 రహదారులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ ప్రతిపాదనలు చేశారు. మియాపూర్‌ నుంచి గండిమైసమ్మ, దుండిగల్‌ నుంచి గాగిల్లాపూర్‌, దూలపల్లి నుంచి జీడిమెట్ల ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌, దుండిగల్‌ నుంచి బాసరగడి, బౌరంపేట ఎస్సీ కాలనీ నుంచి రింగ్‌రోడ్డు, దుండిగల్‌ గౌడవవల్లి నుంచి బాసరగడి వయా ఓఆర్‌ఆర్‌, జ్ఞానపూర్‌, మల్లంపేట నుంచి ఓఆర్‌ఆర్‌ వయా ఈద్గా, దుండిగల్‌ నుంచి నర్సాపూర్‌ వయా గౌడవవల్లి, అప్రోచ్‌ రోడ్‌ నుంచి సారగూడెం, అప్రోచ్‌రోడ్డు నుంచి డీపోచంపల్లి, అప్రోచ్‌ రోడ్డు నుంచి శంభీపూర్‌, బౌరంపేట, మల్లంపేట రోడ్డు నుంచి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, బహదూర్‌పల్లి నుంచి సూరారం, వీకర్‌ సెక్షన్‌ హౌసింగ్‌ కాలనీ నుంచి బహదూర్‌పల్లి, దొమ్మరి పోచంపల్లి నుంచి నర్సాపూర్‌ వయా నూతన్‌కల్‌, బౌరంపేట ఎస్సీ కాలనీ నుంచి మియాపూర్‌, బహదూర్‌పల్లి కొంపల్లి నుంచి వీకర్‌సెక్షన్‌ కాలనీ దూలపల్లి వరకు రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

Updated Date - 2022-11-21T00:30:15+05:30 IST

Read more