కాలనీలు, బస్తీల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-11-24T23:27:34+05:30 IST

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కాలనీలు, బస్తీల్లో సమస్యల పరిష్కారానికి ప్రధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.

కాలనీలు, బస్తీల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
సాయివైభవ్‌ కాలనీలో డ్రైనేజీని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గాంధీ, మాజీ కార్పొరేటర్‌ సాయిబాబా

  • ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

రాయదుర్గం, నవంబర్‌ 24(ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కాలనీలు, బస్తీల్లో సమస్యల పరిష్కారానికి ప్రధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గురువారం గచ్చిబౌలి డివిజన్‌ సాయివైభవ్‌ కాలనీలో జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ సాయిబాబాతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలంలో నాలా పొంగి కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారని, దీనిని దృష్టిలో ఉంచుకుని కాలనీలోని నాలా విస్తరణ పనులను పొడిగించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కాలనీలోని సమస్యలు పరిష్కరించడంతో పాటు అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. సాయివైభవ్‌కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీల మధ్య రూ.30లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న లింక్‌ రోడ్డు నిర్మాణ పనులకు సంబంఽధించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈఈ శ్రీనివాస్‌, డీఈ విశాలక్షి, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌, టౌన్‌ ప్లానింగ్‌ టీపీఎస్‌ రమేష్‌, నాయకులు రమేష్‌, జగదీష్‌, కాలనీ అధ్యక్షుడు సత్యనారాయణ, వైస్‌ప్రెసిడెంట్‌ అశోక్‌రాజు, పద్మావతి, జనరల్‌ సెక్రటరీ, కాలనీ వాసులు అప్పారావు, దిలీప్‌, సుధాకర్‌, బాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సీసీరోడ్డు నిర్మాణ పనుల పరిశీలన

రాయదుర్గంలోని ముస్లిం బస్తీలో రూ.25లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీరోడ్డు నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గురువారం పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ సాయిబాబా, స్థానికులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:27:34+05:30 IST

Read more