పోలీస్‌ నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలి

ABN , First Publish Date - 2022-09-12T03:52:34+05:30 IST

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలని గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది.

పోలీస్‌ నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలి

పంజాగుట్ట, సెప్టెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నిర్వహించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలని గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులు స్పందించకపోతే ప్రగతిభవన్‌, అసెంబ్లీలను ముట్టడిస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ బంజారా హెచ్చరించారు. 2016, 2018ల్లో పోలీస్‌ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు పాటించారని, ఇప్పుడెందుకు పాటించరని ఆయన ప్రశ్నించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం జాతీయ అధ్యక్షుడు ఇందల్‌ రాథోడ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోహిత్‌నాయక్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌ నాయక్‌ లతో కలిసి మాట్లాడారు. ఎస్‌ఐ, కానిేస్టబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కటాఫ్‌, నెగెటివ్‌ మార్కులు తీసివేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 40 మార్కులు, బీసీ విద్యార్థులకు 50 మార్కులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం నాయకులు సుధీర్‌నాయక్‌, భరత్‌నాయక్‌, శ్రీనునాయక్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-12T03:52:34+05:30 IST