PM Modi: ఈనెల 11న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-10-03T18:08:14+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు.

PM Modi: ఈనెల 11న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

హైదరాబాద్ (Hyderabad): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Narendramodi) ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. నగరంలో జరగనున్న యుఎన్‌డబ్ల్యూజీఐసీ (UNWGIC) సదస్సులో ప్రధాని మోదీ  ప్రసంగించనున్న‌ారు. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా యుఎన్‌డబ్ల్యూజీఐసీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకానుంది. అలాగే 120 దేశాలకు చెందిన సుమారు 2వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.

Updated Date - 2022-10-03T18:08:14+05:30 IST