నిందితులతో కలిసి ప్లాన్ అమలు చేసిన Gayatri

ABN , First Publish Date - 2022-05-30T23:56:31+05:30 IST

Hyderabad: కొండాపూర్‌లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు గాయత్రి, భర్త శ్రీకాంత్ పాత్రపై ఆరా

నిందితులతో కలిసి ప్లాన్ అమలు చేసిన Gayatri

Hyderabad: కొండాపూర్‌లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు గాయత్రి, భర్త శ్రీకాంత్ పాత్రపై ఆరా తీస్తున్నారు. సంతానం కలగకపోవడంతో గాయత్రి ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. ఈ క్రమంలో హాస్పిటల్‌కు వెళ్లేందుకు తరుచూ ఓ వెబ్‌సైట్‌లో కారును బుక్ చేసుకునేది. ఆ రోజు కూడా కారును బుక్ చేసుకోవడంతో గాయత్రిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లేందుకు విష్ణు వర్ధన్, మనోజ్‌ వచ్చారు. వారికి తన ప్లాన్ చెప్పింది గాయత్రి. ఇదే విషయాన్ని మనోజ్ తన స్నేహితుడు, ఆటో డ్రైవర్ అయిన మౌలాలికి చెప్పాడు. గాయత్రికి సంబంధించిన ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న మస్తాన్‌కు కూడా గాయత్రి తన ప్లాన్ చెప్పడంతో.. మస్తాన్ తన స్నేహితుడు ముజాహుద్దీన్ పిలిచాడు. పథకం ప్రకారం ఈ ఐదుగురిని ముందుగానే గాయత్రి తన ఇంట్లోని ఓ గదిలో ఉంచింది. గాయత్రి బాధితురాలిని మాత్రం గదిలోకి తీసుకెళ్లి ఆమె తల్లిదండ్రులను బయట ఉంచింది. గదిలో నలుగురు నిందితులు బాధితురాలి కాళ్ళు, చేతులూ కట్టేసి వివస్త్రను చేశారు. మరో నిందితుడు లైంగిక దాడికి పాల్పడుతుండగా..గాయత్రి బాధితురాలిని తిడుతూ సెల్‌ఫోన్లో వీడియో తీసింది. విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడతానని గాయత్రి బాధితురాలిని బెదిరించింది. ఘటన సమయంలో శ్రీకాంత్ ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు.

Read more