3న పని చేయనున్న పాస్‌పోర్టు సేవా కేంద్రాలు: దాసరి బాలయ్య
ABN , First Publish Date - 2022-11-30T04:11:05+05:30 IST
దరఖాస్తుదారుల సౌకర్యార్థం డిసెంబరు 3న పాస్‌పోర్టు కేంద్రాలు పని చేస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

సికింద్రాబాద్, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి): దరఖాస్తుదారుల సౌకర్యార్థం డిసెంబరు 3న పాస్‌పోర్టు కేంద్రాలు పని చేస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని అమీర్‌పేట్, బేగంపేట్, టోలిచౌకి, కరీంనగర్, నిజామాబాద్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలలో పాస్‌పోర్టు దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. పాస్‌పోర్టు దరఖాస్తుల అపాయింట్‌మెంట్లను రెండు రోజుల ముందు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
Read more