నుమాయిష్‌ నిలిపివేత

ABN , First Publish Date - 2022-01-03T14:56:32+05:30 IST

నాంపల్లిలో కొనసాగుతున్న నుమాయి్‌షను పదిరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో నుమాయి్‌షకు పది వేల మందికిపైగా సందర్శకులు వచ్చారు. భౌతికదూరం నిబంధనలు గాలికి

నుమాయిష్‌ నిలిపివేత

ఆదివారం అర్ధరాత్రి నిర్ణయం

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్: నాంపల్లిలో కొనసాగుతున్న నుమాయి్‌షను పదిరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో నుమాయి్‌షకు పది వేల మందికిపైగా సందర్శకులు వచ్చారు. భౌతికదూరం నిబంధనలు గాలికి వదిలేశారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు బేగంబజార్‌ పోలీసులు నుమాయిష్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి నుమాయిష్‌ నిర్వాహక సభ్యులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చర్చల అనంతరం ఎగ్జిబిషన్‌ను పది రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు తెరిచేది వైద్యశాఖ మంత్రితో మాట్లాడిన తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

Read more