నిర్మలా సీతారామన్‌ బెదిరింపులకు జంకేది లేదు

ABN , First Publish Date - 2022-11-12T03:23:09+05:30 IST

రాష్ట్రాల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) ఉద్యోగులు నేషనల్‌ పెన్షన్‌ సిస్టం (ఎన్‌పీఎ్‌స) ట్రస్టులో దాచుకున్న డబ్బును వెనక్కి తీసుకోవడానికి పీఎ్‌ఫఆర్‌డీఏ చట్టంలో ఏ నిబంధనలేద ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌ఎంఓపీఎ్‌స) సెక్రటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

నిర్మలా సీతారామన్‌ బెదిరింపులకు జంకేది లేదు

సీపీఎస్‌ డబ్బును వెనక్కి తీసుకోరాదనడం సరికాదు

ఎన్‌ఎంఓపీఎ్‌స సెక్రటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) ఉద్యోగులు నేషనల్‌ పెన్షన్‌ సిస్టం (ఎన్‌పీఎ్‌స) ట్రస్టులో దాచుకున్న డబ్బును వెనక్కి తీసుకోవడానికి పీఎ్‌ఫఆర్‌డీఏ చట్టంలో ఏ నిబంధనలేద ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌ఎంఓపీఎ్‌స) సెక్రటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల మూలవేతనాల నుంచి 10 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం సొమ్మును ఎన్‌పీఎ్‌స ట్రస్టులో ప్రతి నెలా జమ చేస్తున్నాయని తెలిపారు. అయితే ఉద్యోగుల డిమాండ్‌ మేరకు కొన్ని రాష్ట్రాలు సీపీఎ్‌సను రద్దు చేసి ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఓపీఎ్‌స)ను అమలు చేస్తున్నాయని చెప్పారు.

రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు సీపీఎ్‌సను రద్దు చేసి ఓపీఎ్‌సను అమలు చేస్తున్నాయన్నారు. ఇలాంటి రాష్ట్రాలు ఎన్‌పీఎ్‌సలో జమైన తమ ఉద్యోగుల సొమ్మును వెనక్కి తీసుకోవడానికి పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (పీఎ్‌ఫఆర్‌డీఏ)కి లేఖలు పంపుతున్నాయని తెలిపారు. అయితే పీఎ్‌ఫఆర్‌డీఏ చట్టం ప్రకారం ఆ సొమ్మును వెనక్కి తీసుకోవడానికి వీల్లేదంటూ నిర్మలా సీతారామన్‌ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఆమె బెదిరింపులకు జంకేది లేదని స్థిత ప్రజ్ఞ అన్నారు. ఈ సొమ్ము పూర్తిగా ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినదని, దీనిపై కేంద్రానికి ఎలాంటి అధికారంలేదని తెలిపారు. సీపీఎ్‌సను రద్దు చేసుకునే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకున్నాయని, సొమ్మును వెనక్కి తెప్పించుకుని, ఓపీఎ్‌సను అమలు చేయవచ్చన్నారు.

Updated Date - 2022-11-12T03:23:10+05:30 IST