చర్లపల్లి జైలులో బాల నేరస్థులు

ABN , First Publish Date - 2022-09-08T05:52:21+05:30 IST

bala nerastulu

చర్లపల్లి జైలులో బాల నేరస్థులు

  • బాలల న్యాయమండలి సభ్యుడి తనిఖీలో వెల్లడి

కుషాయిగూడ, సెప్టెంబర్‌ 7 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లి కేంద్ర కారాగారంలో నలుగురు మైనార్టీ తీరని వారు ఖైదీలుగా ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. బుధవారం చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని రంగారెడ్డి జిల్లా బాలల న్యాయమండలి సభ్యుడు జి.వాసు తనిఖీ చేశారు. జైలు పరిసరాలను, రిజిస్టర్లను పరిశీలించిన ఆయన సూపరింటెండెంట్‌ సంతో్‌షకుమార్‌ రాయ్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ శశికాంత్‌లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం వివిధ బ్యారక్‌లను పరిశీలించగా నలుగురు బాలలు ఉన్నట్లు గుర్తించారు. పద్దెనిమిది సంవత్సరాల లోపు వారిని జైలులో ఉంచరాదని, జువైనల్‌ యాక్డు నిబంధనల మేరకు వారికి వయసు నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. వారి సంరక్షణ బాధ్యతను సైదాబాద్‌లోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించాలని ఆదేశించడంతో అధికారులు వారిని అక్కడకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 

Read more