వీఎస్టీలో నూతన వేతన అగ్రిమెంట్‌

ABN , First Publish Date - 2022-12-30T00:34:28+05:30 IST

వి.శ్రీనివా్‌సరెడ్డి, అశోక్‌రెడ్డిని సన్మానిస్తున్న వీఎస్టీ కార్మికులు వీఎస్టీలో నూతన వేతన అగ్రిమెంట్‌ రాంనగర్‌, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : వీఎస్టీ కంపెనీ కార్మికుల కోసం నూతన వేతన అగ్రిమెంట్‌ అమలయ్యేలా కృషి చేస్తానని వీఎస్టీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వి.శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన కంపెనీ వర్కర్స్‌ యూనియన్‌ ఎన్నికల్లో 5వసారి ఘన విజయం సాధించిన వి.శ్రీనివా్‌సరెడ్డి గురువారం విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆజామాబాద్‌లోని కంపెనీ కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా సేవలందిస్తానని శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ని కంపెనీలోని నాలుగు షిప్టుల కార్మికులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌రెడ్డి, కోశాధికారి ఐలి ప్రభాకర్‌, ఉపాధ్యక్షుడు శాంసన్‌, నాయకులు వాసు, రాంరెడ్డి, నరేందర్‌గౌడ్‌, రవియాదవ్‌, బుచ్చిరెడ్డి, బాబు, అతిఖ్‌, రాములు తదితరులు పాల్గొన్నారు. వి.శ్రీనివా్‌సరెడ్డి, అశోక్‌రెడ్డిని సన్మానిస్తున్న వీఎస్టీ కార్మికులు

వీఎస్టీలో నూతన వేతన అగ్రిమెంట్‌
వి.శ్రీనివా్‌సరెడ్డి, అశోక్‌రెడ్డిని సన్మానిస్తున్న వీఎస్టీ కార్మికులు

రాంనగర్‌, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : వీఎస్టీ కంపెనీ కార్మికుల కోసం నూతన వేతన అగ్రిమెంట్‌ అమలయ్యేలా కృషి చేస్తానని వీఎస్టీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వి.శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన కంపెనీ వర్కర్స్‌ యూనియన్‌ ఎన్నికల్లో 5వసారి ఘన విజయం సాధించిన వి.శ్రీనివా్‌సరెడ్డి గురువారం విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆజామాబాద్‌లోని కంపెనీ కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా సేవలందిస్తానని శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ని కంపెనీలోని నాలుగు షిప్టుల కార్మికులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌రెడ్డి, కోశాధికారి ఐలి ప్రభాకర్‌, ఉపాధ్యక్షుడు శాంసన్‌, నాయకులు వాసు, రాంరెడ్డి, నరేందర్‌గౌడ్‌, రవియాదవ్‌, బుచ్చిరెడ్డి, బాబు, అతిఖ్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:35:01+05:30 IST

Read more