ముస్లింల సంక్షేమంపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-12-13T00:49:33+05:30 IST

ముస్లింల సంక్షేమంపై నిర్లక్ష్యం కవాడిగూడ, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి) : ముస్లింల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. వారి ఆర్థిక స్థితిగతులపై సుధీర్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై సమీక్షా సమావేశం నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇందిరా పార్కు వద్ద ముస్లిం యూనైటెడ్‌ ఫెడరేషన్‌ సోమవారం నిర్వహించిన ధర్నాలో కోదండరాం మాట్లాడారు. తెలంగాణలో వక్ఫ్‌ భూముల అన్యాక్రాంతం ఆగడంలేదన్నారు. 2014 నాటి ఎన్నికల మేనిఫెస్టోలో వక్ఫ్‌బోర్డుకు జ్యూడిషియల్‌ పవర్‌ ఇస్తానన్న కేసీఆర్‌ హామీ నేటికీ నెరవేరలేదన్నారు. ఐదేళ్ల నుంచి మైనార్టీ పేదలకు ఇచ్చే సబ్సిడీ రుణాలను కేసీఆర్‌ ప్రభు త్వం పూర్తిగా నిలిపివేసిందన్నారు. వక్ఫ్‌బోర్డు పాలకమండలిని ఎన్నికల ద్వారా నియమించాలని కోరారు. బీఎస్పీ అధికార ప్రతినిధి అరుణ క్వీన్‌, ప్రొఫెసర్‌ అన్వర్‌ఖాన్‌, కాంగ్రెస్‌ నేత మతీన్‌ షరీఫ్‌, ముస్లిం సంఘాల నాయకులు అలీమ్‌ఖాన్‌పల్‌కీ, ఓయు విద్యార్థి నాయకుడు సలీంపాషా, మౌలానా హామిద్‌ సుత్తారి మాట్లాడుతూ తెలంగాణలో ముస్లింలకు న్యాయ జరగడం లేదన్నారు. తె లంగాణ విశ్వ విద్యాలయాల్లో ఏ ఒక్క విద్యాలయానికి కూడా ముస్లిం వైస్‌చాన్స్‌లర్‌ను నియమించలేదన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ అంశాన్ని కేసీఆర్‌ కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలకు 12శాతం టిక్కెట్లు సీఎం కేటాయించాలని డిమాండ్‌ చేశా రు. డబుల్‌ బెడ్‌ ఇళ్ల కేటాయింపులో 12 శాతం రిజర్వేషన్‌ అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. నామినేటెడ్‌ పదవుల్లో ముస్లింలకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మౌలానా సుఫీ ఖయూరీద్దీన్‌, అబ్రార్‌ హుస్సేన్‌, మౌలానా షపీ, విద్యార్థి నాయకులు సయుఫీద్దీన్‌, యాకూబ్‌, వహీద్‌ అలీ, జమీన్‌ సుల్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ముస్లింల సంక్షేమంపై నిర్లక్ష్యం

కవాడిగూడ, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి) : ముస్లింల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. వారి ఆర్థిక స్థితిగతులపై సుధీర్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై సమీక్షా సమావేశం నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇందిరా పార్కు వద్ద ముస్లిం యూనైటెడ్‌ ఫెడరేషన్‌ సోమవారం నిర్వహించిన ధర్నాలో కోదండరాం మాట్లాడారు. తెలంగాణలో వక్ఫ్‌ భూముల అన్యాక్రాంతం ఆగడంలేదన్నారు. 2014 నాటి ఎన్నికల మేనిఫెస్టోలో వక్ఫ్‌బోర్డుకు జ్యూడిషియల్‌ పవర్‌ ఇస్తానన్న కేసీఆర్‌ హామీ నేటికీ నెరవేరలేదన్నారు. ఐదేళ్ల నుంచి మైనార్టీ పేదలకు ఇచ్చే సబ్సిడీ రుణాలను కేసీఆర్‌ ప్రభు త్వం పూర్తిగా నిలిపివేసిందన్నారు. వక్ఫ్‌బోర్డు పాలకమండలిని ఎన్నికల ద్వారా నియమించాలని కోరారు. బీఎస్పీ అధికార ప్రతినిధి అరుణ క్వీన్‌, ప్రొఫెసర్‌ అన్వర్‌ఖాన్‌, కాంగ్రెస్‌ నేత మతీన్‌ షరీఫ్‌, ముస్లిం సంఘాల నాయకులు అలీమ్‌ఖాన్‌పల్‌కీ, ఓయు విద్యార్థి నాయకుడు సలీంపాషా, మౌలానా హామిద్‌ సుత్తారి మాట్లాడుతూ తెలంగాణలో ముస్లింలకు న్యాయ జరగడం లేదన్నారు. తె లంగాణ విశ్వ విద్యాలయాల్లో ఏ ఒక్క విద్యాలయానికి కూడా ముస్లిం వైస్‌చాన్స్‌లర్‌ను నియమించలేదన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ అంశాన్ని కేసీఆర్‌ కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలకు 12శాతం టిక్కెట్లు సీఎం కేటాయించాలని డిమాండ్‌ చేశా రు. డబుల్‌ బెడ్‌ ఇళ్ల కేటాయింపులో 12 శాతం రిజర్వేషన్‌ అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. నామినేటెడ్‌ పదవుల్లో ముస్లింలకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మౌలానా సుఫీ ఖయూరీద్దీన్‌, అబ్రార్‌ హుస్సేన్‌, మౌలానా షపీ, విద్యార్థి నాయకులు సయుఫీద్దీన్‌, యాకూబ్‌, వహీద్‌ అలీ, జమీన్‌ సుల్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:49:44+05:30 IST