National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసు.. టీకాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

ABN , First Publish Date - 2022-09-30T16:29:30+05:30 IST

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో టీకాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారు.

National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసు.. టీకాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు (Telangana Congress leaders) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులు అందుకున్న నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ రావాల్సిందిగా పిలుపిచ్చింది. టీ కాంగ్రెస్ నేతలు షబ్బీర్అలీ (Shabbeer Ali), గీతారెడ్డి (Geetha Reddy), అంజన్‌కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav), సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy), రేణుకాచౌదరి (Renuka Choudary), అనిల్‌కుమార్ (Anilkumar) తదితరులు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఏఐసీసీ ఆడిటర్లతో భేటీ కానున్నారు. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా (Sonia), రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)లను ఈడీ (ED) అధికారులు విచారించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-09-30T16:29:30+05:30 IST