Lokesh: ముక్కుసూటితనం మావయ్య హరికృష్ణ నైజం

ABN , First Publish Date - 2022-08-29T17:54:35+05:30 IST

నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేత నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు.

Lokesh: ముక్కుసూటితనం మావయ్య హరికృష్ణ నైజం

అమరావతి (Amaravathi): నందమూరి హరికృష్ణ (Harikrishna) వర్ధంతి సందర్భంగా టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. రాజకీయాల్లోనూ, నటనలోనూ తనకంటూ మామయ్య హరికృష్ణ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ముక్కుసూటితనం నందమూరి హరికృష్ణ నైజమని, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వమని లోకేష్ ప్రశంసించారు.

Updated Date - 2022-08-29T17:54:35+05:30 IST