న్యూ ఇయర్‌ వేడుకలకు మరింత కిక్కు

ABN , First Publish Date - 2022-12-30T03:47:53+05:30 IST

ఎప్పట్లాగే ఈ సారి కూడా న్యూఇయర్‌ వేడుకలకు మరింత కిక్కు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

న్యూ ఇయర్‌ వేడుకలకు మరింత కిక్కు

31వ తేదీ అర్ధరాత్రి 12 వరకు మద్యం షాపులు ఓపెన్‌

బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లకు ఒంటి గంట దాకా అనుమతి

ఈవెంట్లలో కూడా ఒంటిగంట దాకా మద్యం

ఎక్సైజ్‌శాఖ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఎప్పట్లాగే ఈ సారి కూడా న్యూఇయర్‌ వేడుకలకు మరింత కిక్కు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం ప్రియుల కోసం ఆనవాయితీగా వెసులుబాటు కల్పించింది. డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరిపేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు ఈ నెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంటాయి. ఇక, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, క్లబ్బులు, టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు చెందిన హోటళ్లు 31వ తేదీన రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంటాయి. ఈవెంట్‌ పర్మిషన్లు తీసుకున్న వారు కూడా రాత్రి ఒంటి గంట వరకు మద్యాన్ని సర్వ్‌ చేసుకోవచ్చు. అయితే, ఈవెంట్లలో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Updated Date - 2022-12-30T03:47:53+05:30 IST

Read more