MLC Kavitha: ఇండియా గేట్ ముందు బతుకమ్మ సంబరాలు.. కేసీఆర్ గొప్పదనమే

ABN , First Publish Date - 2022-09-28T00:53:06+05:30 IST

Delhi: తెలంగాణ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. మొదటిసారిగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ (Delhi)లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కర్తవ్య పథ్ (ఇండియా గేట్) ముందు నిర్వహించిన ఈ వేడుకలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)తో పాటు ఢిల్లీలోని తెలుగు మహిళలు పాల్గొన్నారు.

MLC Kavitha: ఇండియా గేట్ ముందు బతుకమ్మ సంబరాలు.. కేసీఆర్ గొప్పదనమే

Delhi: తెలంగాణ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. మొదటిసారిగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ (Delhi)లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కర్తవ్య పథ్ (ఇండియా గేట్) ముందు నిర్వహించిన ఈ వేడుకలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)తో పాటు ఢిల్లీలోని తెలుగు మహిళలు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి సతీమణి కావ్య, జీవిత రాజశేఖర్, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక, పలువురు మహిళలు బతుకమ్మ ఆడారు. ఇండియా గేట్ ముందు బతుకమ్మ సంబరాలను వీక్షించేందుకు వీలుగా నాలుగు ఎల్ఈడీ స్క్రీన్ లను సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేయడం మరో విశేషం. 


అది కేసీఆర్ గొప్పదనమే..

ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బతుకలు వేడుకలు నిర్వహించడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ‘‘తెలంగాణ వచ్చాక ఎనిమిదేళ్లకు బీజేపీ‌కి బుద్ధి వచ్చింది. గెట్ వే ఆఫ్ ఇండియా దగ్గర బతుకమ్మ ఆడుతున్నారు. ఇదంతా కేసీఆర్ గొప్పతనం. తెలంగాణ‌లో సర్దార్ వల్లబాయి పటేల్ పేరుతో విమోచనం అంటారు. గుజరాత్‌లో అదే పటేల్ విగ్రహం పెట్టి స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీ అంటున్నారు. విభజన కావాలో..యూనీటి కావాలో? తేల్చుకోవాలి’’ అని కవిత పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-28T00:53:06+05:30 IST