బతుకమ్మ ఆడిన ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2022-10-03T15:20:13+05:30 IST

హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సత్యవతి రాథోడ్‌, మేయర్‌ గద్వాల్‌

బతుకమ్మ ఆడిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్/పంజాగుట్ట: హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సత్యవతి రాథోడ్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత రెడ్డి, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్‌ నాయుడు, రవికాంత్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీకాంత్‌రావు, వనజ, సంయుక్త కార్యదర్శులు హరిప్రసాద్‌, రమేష్‌ వైట్ల, కార్యవర్గ సభ్యులు, మహిళా జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. బతుకమ్మల తయారీ పోటీలో ఉత్తమ బతుకమ్మను పేర్చిన ఆకారపు రమాదేవికి బహుమతి అందజేశారు. 

Read more