Telangana మీద కక్ష గట్టి BJP కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది: TRS MLA

ABN , First Publish Date - 2022-07-03T19:17:19+05:30 IST

తెలంగాణ మీద కక్ష గట్టి బీజేపీ (BJP) కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

Telangana మీద కక్ష గట్టి BJP కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది: TRS MLA

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ మీద కక్ష గట్టి బీజేపీ (BJP) కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ (Vivekanand Goud) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మీద రాక్షసులు పడినట్లు బీజేపీ నేతలు పడ్డారన్నారు. నరేంద్ర మోదీ (Modi) రాజకీయాలకు రాకముందే కేసీఆర్ (KCR) ఎమ్మెల్యే అయ్యారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తక్కువ అప్పులు తెలంగాణ తీసుకుంటోందన్నారు. టూర్‌కు వచ్చిన అనురాగ్ ఠాగూర్ అన్నీ తెలుసుకొని మాట్లాడాలన్నారు. బండి సంజయ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కరీంనగర్ చౌరస్తాలో వంద రూపాయలు పెడితే చెల్లని వ్యక్తి బండి సంజయ్ అని, అలాంటి నాయకుడు ఉండటం మన ఖర్మ అని అన్నారు. రామ్‌నాథ్ కోవింద్‌‌కు కూడా ఘన స్వాగతం పలికామన్నారు. బీజేపీ సభకు జనాలు వచ్చేలా లేరని కుర్చీలు వేసి షెడ్లు వేస్తున్నారని, ప్రజల నుంచి స్పందన లేదన్నారు. జన సమీకరణ చేసే సత్తా రాష్ట్ర బీజేపీ నాయకులకు లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ప్రశ్నలకు.. ప్రధాని మోదీ సమాధానం కోసం వేచి చూస్తామని ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ అన్నారు.

Read more